విశాఖ ఘటన : 11కి చేరిన మృతుల సంఖ్య
విశాఖ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రస్తుత పరిస్థితులని మీడియాకు వివరించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ గ్యాస్ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, 80మందికి పైగా వెంటిలేటర్లపైనే ఉన్నారని ప్రధాన్ తెలిపారు.
లీకైన స్టైరీన్ గ్యాస్ పీల్చిన వారికి కళ్ల మంట, గొంతునొప్పి, వాంతులయ్యాయని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మంచినీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే ఆక్సిజన్ థెరఫీ తీసుకోవాలని కోరారు. ఈ వాయువుతో దీర్ఘకాలిక ప్రభావం తక్కువే ఉంటుందని అన్నారు.