పడకగదికి పిలిచారు.. కానీ ఫోర్స్ చేయలేదు !
సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ ఉన్నదని ఒప్పుకునేవారే ఎక్కువ. ఇండస్ట్రీ ‘కాస్టింగ్ కౌచ్’ ఉంది. కానీ ఆ అనుభవం తమకి ఎదురుకాలేదని చెప్పేవారి హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే. అయితే కొందరు మాత్రమే తాను ‘కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెబుతున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి.. ఫలానా వ్యక్తిని తనని ఇబ్బందులకి గురిచేశాడని చెప్పుకొంటున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ ‘కాస్టింగ్ కౌచ్’పై స్పందించారు. సినీ రంగంలో కూడా జాబ్ ఆఫర్ చేసి కమిట్మెంట్ అడిగేవాళ్ళు ఉన్నారు. ‘కాస్టింగ్ కౌచ్’లు కేవలం ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదని.. ప్రతీ రంగంలో ఉన్న ఆడవాళ్ళకి జాబ్ ఆఫర్ చేసి సెక్సువల్ ఫేవర్ అడిగేవారు ఉన్నారు. అంతేకానీ.. దీని కోసం బలవంతం చేయడం అంటూ ఏమీ ఉండదని చెప్పుకొచ్చింది. తనకి మోడల్ ఉండగానే ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పటికీ ఎదురవుతున్నాయని తెలిపింది.