వైరల్ : ఎన్టీఆర్’ని ఇమిటేట్ చేసిన వార్నర్

ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ భారతీయులని, మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులని ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా కొనసాగుతున్న వార్నర్ కి తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం అనుంది. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, సినిమాలపై ఓ అవగాహన ఉంది.

ఈ నేపథ్యంలో వార్నర్ ఏకంగా ఎన్ టీఆర్ ని ఇమిటేట్ చేశారు. జూనియర్ ఎన్ టీఆర్ ని కాదు.. సీనియర్ ఎన్ టీఆర్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు. ఇటీవలే టిక్ టాక్ లోకి అడుగుపెట్టిన వార్నర్ ఫ్యామిలీతో కలిసి.. వరుగా వీడియోలు చేస్తున్నారు. తాజాగా తన ఇద్దరు కూతుర్లతో భార్యతో కలిసి డేవిడ్ వార్నర్ ఒక వైలన్ మ్యూజిక్ కి కంఫర్టబుల్గా కొన్ని స్టెప్స్ వేసాడు. ఇందులో వార్నర్ సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేశాడు.