హ్యాపీ బర్త్ డే.. బర్నింగ్ స్టార్ !

అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ ఇష్టపడే స్టార్.. బర్నింగ్ స్టార్ సంపూర్ణ్నేష్ బాబు. అందుకే అందరి హీరోల అభిమానుల తరుపున తనకి తానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నాడు సంపూ.

‘అందరి హీరోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు’ అంటూ ట్విట్ చేశాడు. దీంతో.. అరె.. సంపూ బర్త్ డే మరిచిపోయామే.. అంటూ అందరూ విష్ చేయడం మొదలెట్టారు.

సంపూ షేర్ చేసిన పోస్టర్ లో ఆయన మహమ్మారి కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. బహుశా.. ఈ షూట్ ని వుహాన్ లో చేసి ఉంటారేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే సంపూ మనల్ని తన సినిమాలతో నవ్వించాలని.. అలరించాలని కోరుకుంటూ.. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.