కేజీఎఫ్ 2.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ !

జాతీయ స్థాయిలో సత్తా చాటిన దక్షిణాది చిత్రలు బాహుబలి, కేజీఎఫ్. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లో వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ సినిమాలకి ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే వసూళ్లలో మాత్రం బాహుబలి 2 నే టాప్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల లిస్టులో బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 నే నెంబర్ వన్.

ఇప్పుడు బాహుబలి 2 రికార్డుని కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది. కేజీఎఫ్ సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ యేడాది అక్టోబర్ లో కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. కరోనా ఎఫెక్ట్ తో ఇంకాస్త ఆలస్యం కావొచ్చు. ఈలోపు కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. ఇటీవల ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ. 55కోట్లకి కొనుగోలు చేసింది. ఇది బాహుబలి 2 డిజిటల్ రైట్స్ రూ. 51కోట్ల కంటే ఎక్కువ.

ఈ నేపథ్యంలో బాహుబలి 2 రికార్డు ని కేజీఎఫ్ 2 బ్రేక్ చేసిందని యష్ అభిమానులు గొప్పగా చెప్పుకొంటున్నారు. అయితే కేజీఎఫ్ 2 రికార్డుని ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేయడం ఖాయమని బాహుబలి అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇలా దక్షిణాది సినిమాలు రికార్డు బ్రేక్ చేసుకుంటూ.. ఇంకా ఎదగాలని ఆశిద్దాం.