సోషల్ డిస్టెన్స్ తప్పుకాదు : సుప్రీం

మహమ్మారి కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే శరణ్యం. సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం), మాస్క్, పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా మన దరికి చేరకుండా జాగ్రతపడవచ్చు. వీటినే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాయి.

అయితే సోషల్ డిస్టెన్స్/సామాజిక దూరం అనే పదం బాగాలేదనే కామెంట్స్ వినిపించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్స్ అనే పదానికి బదులుగా  భౌతిక దూరం అనే పదాన్ని వాడాలని సూచించారు. సుప్రీం కోర్టులోనూ సోషల్ డిస్టెన్స్ అనే పదంపై పిటిషన్ దాఖలైంది.

సోషల్‌ డిస్టెన్సింగ్‌ పదాన్ని వినియోగించరాదు. డిస్టెన్సింగ్‌ అనే పదం వివక్షతో కూడుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందుకే ఆ పదం వాడుక మార్చాలని షకీల్‌ ఖురేషీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ ని సుప్రీం కొట్టేసింది. అంతేకాదు.. పిల్‌ దాఖలు చేసిన వ్యక్తికి రూ. 10,000 జరిమానా విధించింది.