సాయి పల్లవి బర్త్ డే.. రెండు గిఫ్ట్స్  !


హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకి శుభాకాంక్షలు వెలువెత్తాయి. సాయి పల్లవి కూడా అభిమానులని నిరాశపరచలేదు. అభిమానులకి రెండు గిఫ్ట్స్ అందించింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా నుంచి సాయి పల్లవి అందమైన లుక్ ఒకటి విడుదల చేశారు. ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నుంచి కూడా ఓ పోస్టర్ ని వదిలారు. రెండు కూడా డిఫరెంట్ ఉండటం.. సాయి పల్లవి అభిమానులని ఆకట్టుకుంటోంది.