‘బేతాల్’ ట్రైలర్.. అదిరింది !


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి నెట్ ప్లిక్స్ వెబ్ సిరీస్ ‘బేతాల్’. ఈనెల 24న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుంది. తాజాగా బేతాల్ ట్రైలర్ ను విడుదల చేశారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో విజువల్స్ ఉన్నాయి.

18వ శతాబ్దంకు సంబంధించి ఆర్మీ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది. అత్యంత భయంకరమైన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. బేతాల్ ట్రైలర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !