మా అమ్మ బంగారం

‘మా అమ్మ బంగారం’ అంటున్నారు సినీ తారలు. మదర్స్ డే సందర్భంగా అమ్మప్రేమని గుర్తు చేసుకుంటూ.. మా అమ్మ బంగారం అంటూ పోస్టులు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క శర్మ.. ఇలా ప్రతి ఒక్కరు మా బంగారం అంటూ ట్విట్ చేశారు. మాతృదేవోభవ.. అమ్మకడుపు గర్భగుడి అంటూ డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఓ వీడియోని విడుదల చేశారు. 

“మాతృదేవోభవ.. అమ్మకడుపు గర్భగుడి. అమ్మ ఒడి మొదటి బడి. అమ్మంటే పిల్లలకు పెద్దబాలశిక్ష. అమ్మదీవెనలుంటే అందరికీ శ్రీరామరక్ష. అమ్మ పేగు బంధం.. అమ్మ ప్రేమ గ్రంథం. అమ్మంటే మానవతకు నిలువుటద్దం. అమ్మంటే త్యాగానికి తెలుగు అర్థం. అమ్మ చూపు చుక్కాని.. అమ్మ మనసు మాగాణి. అమ్మ పక్కనుంటే లోకాలన్నీ గెలిచినట్టే. అమ్మ కొంగుపట్టుకుంటే మన దేశ జెండా ఎగరేసినట్టే. అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే” అని సాయికుమార్ వీడియోలో తెలిపారు.