మరోసారి.. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ !

దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు విడతలుగా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 17తో మూడో దఫా లాక్ డౌన్ కూడా ముగియనుంది. ఈ క్రమంలో అన్నీ రాష్ట్రాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే అన్నీ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ మూడుసార్లు వీడియో కాన్పరెన్స్ లో మాట్లాడారు.

మరోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్పరెన్స్ నిర్వహించబోతున్నారు. సోమవారం (మే11)న ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలిసింది. లాక్ డౌన్ సడలింపులు, దేశ ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చంచనున్నారు. అయితే ప్రధాని సూచనలు చేస్తున్నారు. కానీ తాము చేస్తున్న సూచనలని ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇదీగాక.. ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. ప్రతిరోజూ మూడు వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ జోన్లలో తిరిగి  లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేయనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రెడ్, ఆరేంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారడం అటుంచితే.. గ్రీన్ జోన్ లో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే ప్రధాని-సీఎంల వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతని సంతరించుకుంది.