8యేళ్ల ‘గబ్బర్ సింగ్’.. ఆ పవర్ తగ్గలే.. !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కండుపునింపిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఏకంగా విందు భోజనం పెట్టేసిన సినిమా. ఇదీకదరా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే.. అని ప్రతి అభిమాని కాలెరెగిరేసేలా చేసిన సినిమా. పవన్ కల్యాణ్.. ఇంకో వంద సినిమాలు చేయని, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టని, బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేయని.. అయినా అభిమానుల గుండెల్లో మాత్రం ‘గబ్బర్ సింగ్’దే మొదటి స్థానం. అంతలా అభిమానులని అలరించిన సినిమా.

కేవలం పవన్ అభిమానులని మాత్రమే కాదు.. ప్రతి మాస్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన సినిమా. 81 యేళ్ల తెలుగు సినిమా రికార్డ్స్ ని తిరగరాసిన సినిమా గబ్బర్ సింగ్. నేటితో 8యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పవన్ అభిమానులు ఓ డిమాండ్ చేస్తున్నారు. మాకు ‘గబ్బర్ సింగ్’ లాంటి మాస్ హిట్ కావాలని కోరుతున్నారు. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ లని ట్విట్లతో కొడుతున్నారు.

బండ్ల సంగతి ఏమో.. గానీ. దర్శకుడు హరీష్ శంకర్ కి మాత్రం మరోసారి పవన్ అభిమానులని మురిపించే, కేకపెట్టించే ఛాన్స్ ఉంది. ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ పవన్.. హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది గబ్బర్ సింగ్ ని మించేలా లేకపోయినా.. ఆ రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్  నాడీ, వాడి-వేడి.. హరీష్ కి తెలుసు. ఆయన మరోసారి పవన్ అభిమానులని కాలరెగిరేసేలా చేస్తారు.. ఇదీ గ్యారెంటీ. ఇదీ ప్రతి పవన్ అభిమాని నమ్మకం. ఆ నమ్మకాన్ని హరీష్ నిలబెట్టుకొంటాడంతే.. !