ఇదీ.. పవర్ స్టార్ స్టామినా.. !

‘గబ్బర్ సింగ్’కి ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. వరుస ప్లాపులతో ఇక పవన్ పనైపోయిందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో పవన్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ‘గబ్బర్ సింగ్’తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటన్నది తెలిసిపోయింది. దశాబ్ధాల రికార్డులని గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది.

అసలు సిసలు మాస్ హిట్ మజా ఏంటో నిరూపించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తిరిగి నిలబెట్టింది. ఆయన అభిమానులని కాలరెగిరేసేలా చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ కి అభిమాని. కాదు భక్తుడు. అభిమానులు పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకుమించి చూపించాడు. అభిమానులు మరిచిపోలేని సినిమాని అందించారు. 8యేళ్లైనా ‘గబ్బర్ సింగ్’పై అభిమానుల ప్రేమ తగ్గలేదు.

తాజాగా  #8YrsOfGabbarSinghHysteria ట్యాగ్ లైన్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కేవలం 15గంటల్లోనే ఈ యాష్ టాగ్ తో 8మిలియన్ ట్విట్స్ చేశారు. ఇప్పటికీ గబ్బర్ సింగ్ క్రేజ్ తగ్గలేదు. ఇదీ.. పవర్ స్టార్ పవర్ పవన్ కల్యాణ్ అని నిరూపిస్తోంది గబ్బర్ సింగ్ 8యేళ్ల పండగ. త్వరలో దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ రేంజ్ హిట్ ఇస్తాడని ఆశిస్తున్నారు పవన్ అభిమానులు.