8యేళ్లు కాదు.. 80యేళ్లైనా గబ్బర్ సింగ్ పవర్ తగ్గదు ! 

‘తింటే గారెలు తినాలి వింటే రామాయణం వినాలి తీస్తే గబ్బర్ సింగ్ తీయాలి’ అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన నిర్మాతగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసింది. ‘గబ్బర్ సింగ్’ విడుదలై నేటితో 8యేళ్లు పూర్తయ్యాయ్. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్ల వర్షం కురిపించాడు. 8యేళ్లు కాదు.. 80యేళ్లైనా గబ్బర్ సింగ్ గురించి చర్చించుకుంటారని బండ్ల రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన అభిమానం తట్టుకోలేని రేంజ్ లో ఉంది. ‘అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను’నని ఫ్యామిలీ కలిసి హోం చేస్తున్న ఫోటోని బండ్ల షేర్ చేశారు. తన ఇద్దరు కొడుకులని ఆశీర్వదించమని ట్విట్టర్ వేదికగా పవన్ ని కోరారు బండ్ల. మొత్తంగా.. పవన్ పై తనకున్న అభిమానాన్ని కురిపించేశాడు.