బ్రేకింగ్ : ఆ కేసులో.. పూనమ్ పాండే అరెస్ట్ !

హాట్ బ్యూటీ, సోషల్ మీడియా క్వీన్ పూనమ్ పాండే, ఆమె బాయ్ ఫ్రెండ్ సామ్ అహమ్మద్ లని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముంబై నగరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైలో లాక్‌డౌన్ ని కఠినంగా అమలు చేస్తున్నారు.

అయితే పూనమ్ పాండే, ఆమె బాయ్ ఫ్రెండ్ ఏ కారణం లేకుండా కారులో ముంబైలో షికారు చేస్తున్నారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పూనమ్ పాండే అరెస్ట్ విషయం తెలిసిన నెటిజన్స్ ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక పూనమ్ జైలు బ్యాక్ డ్రామ్ లో హాట్ వీడియాలో చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. 


ఇర్పాన్ రీ ఎంట్రీకి రెడీ
టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రీ ఎంట్రీకి రెడీ అంటున్నాడు. ఏడాది సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి ఎంపిక చేస్తామంటే, మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్‌ మనసులోని మాటను పంచుకున్నాడు. ”ఇర్ఫాన్‌ నువ్వు రిటైరయ్యావు కానీ.. ఏడాదిలో సన్నద్ధమైతే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తాం’ అని చెబితే, అప్పుడన్నీ వదిలేసి ఆటమీదే దృష్టిసారిస్తా. మనస్ఫూర్తిగా దానిమీదే ధ్యాసపెట్టి, తీవ్రంగా కష్టపడతా. కానీ, అలా మాట్లాడేదెవరు?” అని రైనాతో అన్నాడు.
ఇర్ఫాన్‌ 2003లో 19 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపికై ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొత్తంగా 29 టెస్టులాడిన మాజీ పేసర్‌ 100 వికెట్లు తీశాడు. అలాగే 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టీమ్‌ఇండియాకు ఆడిన ఇర్ఫాన్‌ తర్వాత జమ్మూ కశ్మీర్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు.