బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటాం : తాప్సీ

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ లో పెద్దగా కలిసిరాలేదు. ఆమెని గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే టాలీవుడ్ చూసింది. కానీ ఆమెలోని అద్భుత నటిని గుర్తించలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం తాప్సీకి మంచి పాత్రలు దక్కుతున్నాయి. వాటికి ఆమె పూర్తి న్యాయం చేస్తోంది కూడా. మంచి నటి అనిపించుకుంది. బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. 

పర్సనల్ లైఫ్ గురించి తాప్సీ పెద్దగా సీక్రెట్స్ మెయిన్ టైన్ చేయడం లేదు. తనకి బాయ్ ఫ్రెండు ఉన్నాడని తాప్సీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి తెలిపింది. ‘ఇంతకు ముందే నా లవర్‌ గురించి చెప్పాను. బాయ్ ఫ్రెండ్‌తో నా రిలేషన్ బాగానే ఉంది. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. మాకు పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాం’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.