తెరపైకి ‘గబ్బర్ సింగ్’ గొడవ !
హారీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేష్ నిర్మాత. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అంతకుమించి పవర్ అభిమానులకి విందు భోజనం పెట్టింది. పవర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో.. అవన్నీ గబ్బర్ సింగ్ లో చూపించారు దర్శకుడు హరీష్. ప్రతి ఫ్రేము.. ఓ ఆణిముత్యమే.
సోమవారంతో ‘గబ్బర్ సింగ్’ విడుదలై 8యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన రచ్చ మాములుగా లేదు. ట్విట్ల వర్షం కురిపించారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పవన్ జపం చేశారు. అయితే.. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతిహాసన్ లని బండ్ల పట్టించుకోలేదు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా అంతే. ఆయన ట్విట్టర్ లో విడుదల చేసిన లెటర్ లోనూ బండ్ల పేరుని ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో.. బండ్ల-హరీష్ ల మధ్య పాత గొడవలేమైనా ఉన్నాయా ? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.
Thanks again for the overwhelming appreciations and celebrations…. 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg
— Harish Shankar .S (@harish2you) May 11, 2020
అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను @PawanKalyan #GabbarSingh pic.twitter.com/3Su3TmqERa
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
గబ్బర్ సింగ్ ఇది ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి @PawanKalyan #GabbarSinghTrendDay
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
ఈ రోజుల్లో నిన్న అని రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు కానీ నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను @PawanKalyan #GabbarSinghTrendDay
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
తింటే గారెలు తినాలి వింటే రామాయణం వినాలి తీస్తే గబ్బర్ సింగ్ తీయాలి ఇది నా అదృష్టం జై పవర్ స్టార్ @PawanKalyan #GabbarSinghTrendDay 🙏
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
చరిత్రలో కొన్ని చిరస్థాయిగా ఉండిపోతాయి తెలుగు చలనచిత్ర చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ చరిత్ర @PawanKalyan #GabbarSinghTrendDay 🙏
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అలవాటు అయ్యారు చచ్చిపోయే దాక మర్చిపోలేం @PawanKalyan #8YrsOfGabbarSinghHysteria
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
గబ్బర్ సింగ్ విడుదల రోజు నా అభ్యర్ధన నా బిడ్డలను మీరు ఆశీర్వదించండి మీ బండ్ల గణేష్ @PawanKalyan #8YrsOfGabbarSinghHysteria 🙏 pic.twitter.com/NyQ0t25Z9d
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
ఎనిమిదేళ్లు కాదు 80 ఏళ్ళ తర్వాత కూడా మన గబ్బర్ సింగ్ గురించి చర్చిస్తారు పవర్ స్టార్ ఎప్పటికీ చరిత్ర @PawanKalyan #8YrsOfGabbarSinghHysteria 🙏
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020