వార్నర్.. ఈసారి రాములో రాములా.. !

ఆసీస్ ఓపెనర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోస్ తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగు సినిమాలపై పడిపోయాడు. ఇటీవలే టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ‘పోకిరి’లోని ఫేమస్ డైలాగ్ ని చెప్పి తెలుగు జనాలని ఫిదా చేశాడు.

తాజాగా ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాలో మాస్ సాంగ్ ‘రాములో రాములో.. ‘కి భార్యతో కలిసి చిందులేశాడు. స్టయిల్ లోనూ అల్లు అర్జున్ ని అచ్చుదింపే ప్రయత్నం చేశాడు. చివరల్లో టోపీని విసిరేసి మురిపించేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.