లాక్ డౌన్-4 మరింత సరళంగా !

ఈ నెల 17తో మూడో విడత లాక్ డౌన్ ముగియనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ పొడగించాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. కరోనా మనతో సుదీర్ఘకాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇక మన లక్ష్యాలపై దృష్టిపెట్టాలి. మాస్కు పెట్టుకొని, భౌతిక దూరం పాటిస్తూ ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకే లాక్ డౌన్ -4లో నిబంధనలు కొత్తగా ఉంటాయని తెలిపారు.

రాష్ట్రాల నుంచి అందిన సలహాలు-సూచనల ఆధారంగా నిబంధనలను ఈ నెల 18కి ముందే ప్రకటిస్తామని తెలిపారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.