డిసెంబర్’లో రానా పెళ్లి
‘కక్కొచ్చినా.. కళ్యాణమొచ్చిన ఆగదు’ అంటారు. హీరో రానా దగ్గుపాటి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆయనకి కల్యాణ్ గడియలు దగ్గపడినట్టున్నాయి. మంగళవారం తన ప్రేయసిని పరిచయం చేశాడు రానా. ఆమె ఓకే చెప్పేసింది. ఆమె పేరు మిహికా బజాజ్ అంటూ ప్రేయసితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇప్పుడు పెళ్లి సమయం కూడా ఫిక్సయింది.
రానా ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి సురేష్ బాబు స్పందించారు. వీరిద్దరూ చాలా కాలం నుంచి ఒకరికొకరు తెలుస. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషం. వీరి పెళ్లి డిసెంబర్ లేదా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉందని సురేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం మే అంతా బిజీగా ఉన్నాం. అందులోనూ ఇప్పుడు కరోనా వైరస్ ఒకటి ఉంది.. కాబట్టి వీరి పెళ్లికి కొంత సమయం తీసుకోవాల్సి ఉందని.. అతి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.