రానా పెళ్లిపై త్రిష రియాక్షన్
భల్లాల దేవుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ మంగళవారం ప్రేయసి ఫోటోని షేర్ చేశాడు రానా. ఆమె పేరు మిహిరా బజాజ్. పక్కా హైదరాబాద్ అమ్మాయి అని తెలిపాడు. దీంతో రానాకి శుభాకాంక్షలు వెలువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి, సమంత, శ్రుతి హాసన్, హన్సిక, రాశీ ఖన్నా, కియారా అడ్వాణీ, శోభు యార్లగడ్డ, సాయితేజు, లక్ష్మీ మంచు తదితరులు రానాకు శుభాకాంక్షలు తెలిపారు.
హీరోయిన్ త్రిష కూడా రానా పెళ్లిపై స్పందించింది. ఆమె ఏడుస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. అయితే ఇది నిజం కాదు. నెటిజన్స్ సరదాగా చేసిన పని. ‘తీన్మార్’ సినిమాలో త్రిష ఎమోషనల్ బిట్ సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రానా పెళ్లిపై త్రిష రియాక్షన్ ఇదని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా రానా పెళ్లిపై త్రిష రియల్ రియాక్షన్ ఏంటన్నది ఎవరికీ తెలీదు. తెలియాల్సి ఉంది.
Trisha right now pic.twitter.com/ECs469moZl
— .·★Aꜱʜᴡɪɴ★·.*️⃣ (@alwaysashwin) May 12, 2020