రానా ప్రేయసి మిహీకా బజాజ్ పర్సనల్.. ప్యామిలీ వివరాలు !
ఎట్టకేలకు తన ప్రేమ ఫలించింది.. ఆమె అంగీకరించిందని హీరో రానా దగ్గుపాటి మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రేయసి ఫోటోని షేర్ చేశాడు. ఆమె పేరు మిహీకా బజాజ్ అని తెలిపాడు. దీంతో మిహికా బజాజ్ ఎవరు ? ఏం చేస్తుంటుంది ?? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ ?? అని తెలుసుకోవాలని ఆసక్తితో రానా అభిమానులు ఉన్నారు.
మిహికా బజాజ్ బంటీ-రమేష్ బజాజ్ ల ముద్దుల కూతురు. ముంబయిలోని రచనా సంసాద్‌లో మిహిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లమా పూర్తి చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేశారు. మిహిక ‘డ్యూ డ్రాప్ స్టూడియో’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నారు.
ఆమెకు భారతీయ వాస్తుశిల్ప కళంటే ఇష్టమట. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఆమె Pixie Dust పేరుతో బ్లాగ్ నడుపుతున్నారు. మహీక తల్లి బంటీ బజాజ్ జ్యువెలరీ డిజైనర్. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. మిహికకు సోదరుడు సమర్థ్ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్‌ను చూసుకుంటుంటారట. ఇక విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రితకి మిహిరా బజాజ్ మంచి స్నేహితురాలు అని తెలుస్తోంది.