నేనో విలన్.. యువీ సంచలన వ్యాఖ్యలు !

భారత్ కు టీ20, వన్డే ప్రపంచకప్ లు రావడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర వహించారు. అయితే ఆయన కెరీర్ ఎత్తుపల్లాలుగా సాగింది. తాజాగా దానిపై యువీ స్పందించారు.2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ లో ఓటమితో తానో నేరస్థుడిలా కనిపించాను. ఇంటికి తిరిగొచ్చాక నేనో విలన్‌గా కనిపించాను. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే మీడియా నాపై దాడి చేసింది. అరుస్తూ వెంటపడింది. నా ఇంటిపై రాళ్లు రువ్వారు. ఎవరినో హత్యచేసి జైలుకు వెళ్లిన నేరస్థుడిలా అనిపించానని చెప్పుకొచ్చారు.

 శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచులో యువీ 21 బంతులాడి 11 పరుగులే చేశాడు. మెరుపులు మెరిపిస్తాడని భావించిన అతడు విఫలమవ్వడంతో భారత్‌ 130/4కే పరిమితమైంది. లంకేయులు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఇక కింగ్స్‌ XI పంజాబ్‌ పై యువీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏ ఆటగాడిని అడిగినా ఇచ్చేవారు కాదు. ఫ్రాంచైజీ వదిలేశాక నేను అడిగిన వారినే తీసుకోవడం విచిత్రం. పేరుకే నేను సారథిగా ఉన్నానని కుండబద్దలు కొట్టాడు.