కరోనాపై విజయం.. మరో అడుగు !
మహమ్మారి కరోనాకు మందు కనిపెట్టడంలో ప్రపంచ దేశాలు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ యేడాది చివరికల్లా కరోనాకిమందు రావొచ్చని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆగస్టులోనే కరోనాకి వాక్సిన్ రాబోతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అంతకంటే ముందు కరోనా టెస్టింగ్ లో వేగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ముందడుగు పడింది. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలను రానున్నాయి.
ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ సరికొత్త టెస్టింగ్ పాలసీని కనిపెట్టారు. దీన్ని ‘ఫెలూదా’ అంటారు. ఈ పాలసీలో కేవలం రూ. 500 ఖర్చుతో రెండు గంటల వ్యవధిలో కరోనా నిర్థారణ పరీక్షల రిపోర్ట్ రానుంది. ఫెలూదా విధానంలో కొవిడ్-19 వ్యాధి కారకమైన SARS-COV2 వైరస్ జన్యు నిర్మాణాన్ని గుర్తించి నిర్మూలించేందుకు CRI SPR GN ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.