నిఖిల్ సింపుల్ మ్యారేజ్

యంగ్ హీరో నిఖిల్ ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. జీవితంలో పెళ్లి ఒకేసారి. దాన్ని పండగలా జరుపుకోవాలి. గ్రాండ్ గా చేసుకోవాలని నిఖిల్ భావించారు. కానీ అలా జరగలేదు. చాలా సింపుల్ గా నిఖిల్ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. సరిగ్గా ఉదయం 6.30 నిమిషాలకు ఈ జంట ఒక్కటయ్యింది.

నిజానికి నిఖిల్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి పుణ్యమా అని ఆ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే మే 14న వీరిద్దరి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. అతికొద్ది మంది అతిథుల మధ్య నిఖిల్ పెళ్లి చాలా సింపుల్ గా కానిచ్చేశారు. అయితే కరోనా ప్రభావం తగ్గాక గ్రాండ్ గా పెళ్లి రిసెప్షన్ చేయనున్నారని తెలిసింది. రిసెప్షన్ కి బంధువలు, స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాలని ఆహ్వాహించనున్నారు.