వైరల్ : భర్తని కొట్టిన హీరోయిన్

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో గృహ హింస పెరిగింది. ఇంట్లోనే ఉంటున్న భార్యభర్తలు తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. సామాన్య ప్రజలే కాదు. సెలబ్రిటీలది ఇదే పరిస్థితి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.. భర్త రాజ్ కుంద్రాని చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇది సీరియస్ ఫైట్ కాదు. సరదాగా చేసిన టిక్ టాక్ వీడియో. ఈ వీడియోలో శిల్పా. తన భర్త రాజ్ కుంద్రా కొడుతుంది. ఆమె బట్టలు వెతుక్కునే సమయంలో ఆమె భర్త వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వెంటనే ఆమె తనను విసిగించవద్దు అని చెప్తుంది. పక్కనే చీపురు తో ఉన్న పని మనిషి కూడా తాను చెప్తున్నా వినడం లేదని విసిగిస్తున్నాడు అని చెప్పడం తో ఆగ్రహంగా శిల్పా అతని మీద దాడి చేస్తూ ఉంటుంది.  ఈ వీడియోని మీరు చూసేయండీ.. !