దేవాలయాలు తెరచుకోనున్నాయ్

కరోనా లాక్‌డౌన్ తో బడులు, గుడులు మూతపడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్నీ దేవాలయాలు మూతపడ్డాయి. అయితే త్వరలోనే దేవాలయాలు తిరిగి తెరచుకోనున్నట్టు సమాచారమ్. ఈ నెల 17తో మూడో విడత లాక్‌డౌన్ ముగియనుంది. ఇక నాల్గో విడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో దేవాలయాలు తెరచుకోనున్నట్టు తెలుస్తోంది. దేశం మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. కర్ణాటకలో మాత్రం దేవాలయాలు తెరచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో చర్చించాను. మే 17 తర్వాత వీటిని తెరించేందుకు ముఖ్యమంత్రి సానూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తాజా లాక్‌డౌన్ నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అని రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి సి.టి.రవి మీడియాకు తెలిపారు.