యూట్యూబ్’లో అల.. బిలియన్ రికార్డ్ !

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠుపరంలో’. ఈ సినిమాని అల.. రికార్దులపురంలో అనాలేమో.. ! టన్నులకొద్ది రికార్డులని సృష్టిస్తోంది. తాజాగా ‘అల.. వైకుంఠపురంలో’ మరో రికార్డు వచ్చి చేరింది. అల.. ఆల్బమ్ యూట్యూబ్ లో 1 బిలియన్ స్ట్రీమ్స్ సొంతం చేసుకుంది. లిరికల్ సాంగ్స్ + వీడియో సాంగ్స్ కలిపి బిలియన్ స్ట్రీమ్స్ సొంతం చేసుకున్నాయి.

ఇన్నాళ్లు ఇంగ్లీష్  పాటలకి మాత్రమే బిలియన్ స్ట్రీమ్స్ వస్తాయనుకొనేవాళ్లం. ఇప్పుడు ఆ ఆలోచనని అల.. చెరిపేసింది. 1బిలియన్ స్ట్రీమ్స్ అందుకొనే సత్తా తెలుగు పాటలకి కూడా ఉందని సంగీత దర్శకుడు థమన్ నిరూపించారు. ఒక్కో సాంగ్ ఓ ఆణిముత్యంలా తీర్చిదిద్దారు. థమన్ గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా తక్కువే. అభినందన కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అంతలా అల.. పాటలు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయ్. భవిష్యత్ లోనూ అల.. అంతకుమించిన పాటలని థమన్ అందిస్తారని ఆశిద్దాం.