కరోనా కాటు.. 3లక్షల మంది బలి !
కరోనాకి కోఠి పుర్రెలు కావాలి. కోటి మంది మృతి చెందేదాక కరోనా కంట్రోల్ లోకి రాదు. బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారని కొందరు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం కరోనా విధ్వంసకాండను చూస్తే అదే జరుగుతుందేమోనన్న భయాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బలిగొన్న మానవ ప్రాణాల సంఖ్య తాజాగా మూడు లక్షలు దాటింది. ఒక్క అమెరికాలోనే 85వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు.
భారత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 78,003 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,549 మంది కరోనా కాటుకు బలయ్యారు. అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనా కాటుకి విలవిలాడుతున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి ఎప్పటికి తగ్గదేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఈ నేపథ్యంలో కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలని ప్రపంచ దేశాలు పిలుపుస్తున్నాయి. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు తిరిగి ఊపిరులూదేందుకుగాను పలు దేశాలు భారీ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.