దారుణం : రూ.20 కోసం చిన్నారి హత్య
కర్ణాటకలోని బెళగావి జిల్లా జాగనూర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రూ.20 కోసం ఓ చిన్నారి ప్రాణాల్ని యువతి పొట్టనపెట్టుకుంది. జాగనూర గ్రామంలో బుధవారం దివ్య(4) బిస్కెట్లు కొనేందుకు డబ్బు తీసుకుని దుకాణానికి వెళ్తుండగా పూజా అనే యువతి చూసింది. రూ.20 లాక్కుంది.
పాప ఏడ్వడంతో విషయం బయటకు పొక్కుతుందని ఆమెను బావిలోకి తోసేసింది. తల్లిదండ్రులు వచ్చేలోపే దివ్య ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి.. విచారించగా తానే భావిలోకి తోసేశానని చెప్పింది. ఈ ఘటన స్థానికులని కలిచివేస్తోంది.