ఐపీఎల్ నష్టంపై గంగూలీ మాట
కరోనా ప్రభావంతో క్రీడా టోర్నీలన్నీ రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది జరగాల్సిన ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. అసలు ఏ యేడాది ఐపీఎల్ జరుగుతుందా ? లేదా.. ?? అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం. ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే భారీ నష్టాలు వస్తాయని చెబుతున్నారు. ఏకంగా 4వేల కోట్ల నష్టం వాటిల్లుతుందనే అంచనాలు వేస్తున్నారు.
తాజాగా బీసీసీఐ బాస్ గంగూలీ ఐపీఎల్ పై మరోసారి స్పందించారు. ఈ వైరస్ సంక్షోభంతో ప్రపంచమంతా అనేక విధాలుగా నష్టపోతుందన్నాడు. ఇది బీసీసీఐ కూడా పెద్ద దెబ్బేనని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందని ఇప్పటివరకూ ఆశిస్తూ వచ్చామని భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నామన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరగ్గపోతే భారీగా ఆర్ధిక నష్టం వాటిల్లుతుందన్నాడు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయిలను బీసీసీఐ నష్టపోయే అవకాశం ఉందన్నాడు.