రుతుపవనాల రాక ఎప్పుడంటే ?
నైరుతి రుతుపవనాల రాక ఈ సారి కాస్త ఆలస్యం కానుంది భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాలి. కానీ ఈ ఏడాది జూన్ 5వ తేదీకి 4 రోజుల ముందు లేదా తర్వాత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ రైతలకు శుభవార్త అందింది.
నైరుతి రుతుపవనాలు జూన్ 16 నుంచి 24 లోగా తెలంగాణ రాష్ట్రానికి రానున్నాయి. వానా కాలం అంతా ఆశాజనక వర్షాలు ఉంటాయని, ఖరీఫ్ పంటలకు ఏలాంటి ఢోకా ఉండదని జర్మనీలోని పోట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ ఇంపాక్ట్ రిసెర్చ్ గ్రూప్ లీడర్ ప్రొఫెసర్ ఎలీనా సురోవ్యాట్కినా అంచనా వేసారు. జూన్‌లో వర్షాలు మొదలవుతాయని, జూలైలో కొన్ని రోజులు వర్షాభావ పరిస్థితులు వచ్చి.. ఆ తర్వాత విస్తారంగా వానలు పడతాయని చెప్పారామె.