సారా వ్యాపారం చేస్తున్న నటి అరెస్ట్

కరోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరచుకున్నాయి. కేరళలోనూ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. అయితే ఈలోపు కేరళలో నాటు సారా వ్యాపారం ఊపందుకుంది. కేరళ లోని నెయ్యటింకర ప్రాంతంలో సారా తయారు చేస్తున్నట్టు పోలిసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది.

విషయం ఏంటంటే.. ? రైడ్ చేసిన పోలీసులు అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సారా వ్యాపారం లో ఓ సీరియల్ నటి కూడా ఉండటంతో పోలీసులు కంగు తిన్నారు. సీరియల్ నటి సినీ, విశాక్‌ అనే మరో వ్యక్తికి నాటు సారా దందాతో భాగస్వామ్యం ఉందని తేలింది. వీరిద్దరి పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. చెంబూర్‌కు చెందిన సినీ పలు సీరియల్‌లో నటిస్తోంది. విశాల్ అనే వ్యక్తిపై ఇదివరకు ఓ మర్డర్ కేసు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడీ న్యూస్ కేరళ, దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.