చిరు, చరణ్ @500K ఫాలోవర్స్ !
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అభిమానులని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. పర్సనల్, ఫ్యామిలీ, సినిమాలకి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాల్లో మెగాస్టార్ పెద్దన్న పాత్ర పోషించారు.
సినీ కార్మికుల కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి.. ఆ సంస్థకి నిధులు సేకరించడంలో సోషల్ మీడియాని బాగా వినియోగించుకున్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లు ఇచ్చారు. జాగ్రత్తలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కంటే కొద్దిరోజుల ముందే ఆయన తనయుడు పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిరు, చరణ్ ఇద్దరు ఒకేసారి ట్విట్టర్ ఖాతాలో 500కె ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం విశేషం.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫాలోవర్స్ సంఖ్య 506.5 కే కాగా, రామ్ చరణ్ ఫాలోవర్స్ సంఖ్య 500.3కే గా ఉంది. ట్విట్టర్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి తండ్రి కొడుకులు ఇద్దరు తమదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ అలరిస్తున్నారు.