మాధవీలతని తగులుకున్నారు
హీరో నిఖిల్ పెళ్లిపై హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాస్కులు పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏంటీ ? అని ప్రశ్నించింది. ఇంకో సంవత్సరం ఆగితే పిల్ల దొరకదా ? మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకని.. పెళ్లి కోసం కొన్నాళ్లు ఆగలేనివారు జీవితాంతం సంసారం ఏం చేస్తారు ?? అంటూ సటైర్స్ వేసింది.
మాధవీలత పోస్ట్ పై నెటిజన్స్ మరింత క్లారిటీ కోరారు. ఓ నెటిజన్ ఆమెను “మీరు చెబుతున్నది నిఖిల్ పెళ్లి గురించేనా” అని ప్రశ్నించాడు. దీనికి మాధవీలత సూటీగా సమాధానం చెప్పలేకపోయింది. నా పోస్ట్ సెలబ్రిటీలను ఉద్దేశించి మాత్రమేనని తెలిపింది. దీంతో నెటిజన్స్ మాధవీలతని తగులుకున్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, మీ ఉచిత సలహాలు ఏంటని విమర్శలకు దిగారు. ఓ రేంజ్ లో మాధవీలతని వేసుకుంటున్నారు.