నిశ్శబ్ధం ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ 

కరోనా లాక్‌డౌన్ తో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయన్నది చెప్పలేం. ఈ యేడాది థియేటర్స్ తెరచుకోవడం కష్టమే అంటున్నారు. ఆ తర్వాత తెరచుకున్న జనాలు థియేటర్స్ కి వస్తారనే గ్యారేంటీ లేదు. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు ఓటీటీలో విడుదల ప్రకటన వస్తున్నాయి. ఇటీవలే 7 సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ డేటుని అధికారికంగా ప్రకటించుకున్నాయి.

ఇందులో రెండు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఓటీటీ రిలీజ్ విషయంలో ఆలోచనలోపడ్డ నిశ్శబ్ధం, రెడ్, వి సినిమాలు కూడా డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ కాబోతున్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా నిశ్శబ్ధం ఓటీటీ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన నిశ్శ‌బ్దం సినిమాని థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్ధం తెరకెక్కింది. అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.