నితిన్ పెళ్లి ఎప్పుడు.. ఎక్కడంటే ?
టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ ల వివాహం ఒకే రోజు ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో వీరిద్దరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ప్రభావం ముగిసేదాక ఆగలేకపోయిన నిఖిల్ ఈ నెల 14న సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి పల్లవి వర్మని పెళ్లాడాడు. శామీర్ పేట్ లోని ఓ అతిథి గృహంలో వీరి వివాహం జరిగింది.
నితిన్ మాత్రం పెళ్లి విషయంలో అసలు తొందరపడటం లేదు. డిసెంబర్ లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి నితిన్ పెళ్లిని దుబాయ్ లో చేయాలని భావించారు. కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ తన పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నితిన్ ది ప్రేమ వివాహమే. గతకొన్నాళ్లుగా శాలినితో ప్రేమలో ఉన్న నితిన్.. ఆమెనే జీవిత భాగస్వామిని చేసుకోనున్నారు.