‘నా ఇస్మార్ట్.. ఛార్మి’కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు : పూరి

హీరోయిన్ ఛార్మి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఛార్మికి అత్యంత సన్నిహితుడు, నిర్మాణ భాగస్వామి దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా విష్ చేశారు.

“నా ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీ జీవిత అంత సులువుగా సాగ‌లేదు. అయితే నువ్వెంత బ‌ల‌వంతురాలివో నాకు తెలుసు. మ‌నం క‌లిసి ఇంకా ప్ర‌యాణించాలి. నువ్వు న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేశావు. పూరీ క‌నెక్ట్స్‌కు నువ్వే అస‌లైన బ‌లం. నీకు మరిన్ని విజ‌యాలతో పాటు ఆరోగ్యంగా నువ్వు ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అంటూ పూరి ట్వీట్ చేశాడు.

గత యేడాది పూరి-ఛార్మి ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఫైటర్ రాబోతుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఫైటర్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఆ ప్రభావం తగ్గాక ఫైటర్ షూటింగ్ మొదలుకానుంది.