కేంద్ర ప్యాకేజీలపై కేసీఆర్ ఫైర్

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో కేంద్రం నుంచి సరైన ఆర్థిక సాయం రాకపోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం కట్టుకునే అప్పులకి కేంద్రం షరతులేంటీ ? అని మండిపడ్డారు. రాష్ట్రాలని కేంద్రం బిచ్చగాళ్లుగా భావించిందని ఫైరయ్యారు. కేంద్ర సాయం ఉత్త బోగస్ అన్నారు.

రాష్ట్రాలకి కావాల్సింది ఏంటీ ? రాష్ట్రాల చేతులకి నగదు కావాలని మేం కోరినం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే.. అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణికిపోతది. అది మేం అడిగితే.. మీరు రాష్ట్రాలని బిచ్చగాళ్లుగా భావించింది. 2 శాతం ఎఫ్ఆర్బీఎస్ తెచ్చింది. దీనివలన తెలంగాణ రాష్ట్రాలని 20వేల కోట్లు వస్తయ్. అయితే ఇందుకోసం పెట్టిన కండీషన్స్ నవ్వుకునేలా ఉన్నాయన్నారు.

ఇదీ కూడా రాష్ట్రాలు అప్పు కట్టుకునేదే. వీళ్లు ఇచ్చేది ఏం లేదు. 20వేల కోట్లు మళ్లీ అప్పు కట్టుకునేదే. ఇందులో 5వేల కోట్లు  ఎలాగో వచ్చేంది. మిగిలిన రెండున్నర వేల కోట్లకి ఓ షరతు పెట్టారు. ఇది ప్యాకేజీ అనరు. ఇది ఫెడరల్ వ్యవస్థలో అవలంభించాల్సినవి కాదు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ? మున్సిపాలిటీల ఆదాయం పెంచితే మరో రెండున్నర వేల కోట్ల ప్యాకేజీ ఇస్తారట. వన్ నేషన్ వన్ రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబవర్ 1 ఉన్నాం. కేంద్ర ప్యాకేజీలు పచ్చి మోసం. అంకెల గారెడీ. కేంద్రం తన పరువుని తానే తీసుకుందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలని తెలంగాణలో అమలు చేసేది లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.