జగన్ ఇప్పటికీ మిత్రుడే : కేసీఆర్
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ల లొల్లి మొదలైన సంగతి తెలిసిందే. పోతిరెడ్డి పాడు నుంచి ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని తోడుకొనేందుకు ఏపీ ప్రభుత్వం 203జీవోను విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పోతిరెడ్డిపాడు పంచాయతీపై తెలంగాణలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయ్. ఇది ఇద్దరు సీఎంల కిమ్ముక్కని విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాల విమర్శలకి సోమవారం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ‘మాకున్న వాట పరిధిలోనే ప్రాజెక్టులు కట్టుకున్నం. ఏపీలో మాకు ఏలాంటి విబేధాల్లేవ్. పోతిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడే లేఖ రాసింది. దానిపై అధ్యయనం చేస్తున్నం. గోదావరిలో సముద్రానికి పోతున్నాయి నీళ్లు. అవి రాయలసీమకి తీసుకుపోమ్మని నేనే చెప్పిన. అది తప్పా. సీఎం జగన్ ఇప్పటికీ మిత్రుడే. కలిసి పనిచేస్తం అన్నారు సీఎం కేసీఆర్.