లైవ్ : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

తెలంగాణలోనూ 31 వరకు లాక్  డౌన్ ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో లాక్ డౌన్ మార్గదర్శకాలను సీఎం వివరించారు. కంటైన్మెంట్ ఏరియాలో ప్రభావం ఉన్న పరిసరాల్లోనే లాక్ డౌన్ అమలులో ఉంటుంది. పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్ ఏరియా ఉంటుంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్ +2, టాక్సీలో డ్రైవర్+3 నియమం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్ ను అనుమతి ఇస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలు తీసుకొని, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లైవ్ లో మీరు చూసేయండీ..!