లావణ్య.. ఎంత మాట అనేశాడు !
కరోనా లాక్డౌన్ తో సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు నేర్చుకుంటున్నారు. అదే సమయంలో అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారితో ముచ్చటిస్తున్నారు. సోమవారం అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా అభిమానులతో చాట్ చేశారు. ఈ సందర్భంగా పర్సనల్, సినిమా, ఇతర నటీనటుల గురించి ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
ఓ నెటిజన్ మాత్రం లావణ్యని పెద్ద మాటే అనేశాడు. సెలబ్రిటీ అని పొగరు కదా ! రిప్లై ఇవ్వడం లేదని కామెంట్ పెట్టాడు. దానికి లావణ్య కూల్ గా సమాధానం ఇచ్చింది. ఇదిగో చూడు ఎంత మందికి రిప్లై ఇచ్చానోనని సమాధానం ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ అభిమాని అడగగా.. అసమానతలకి ఎదురునిలబడి పోరాడుతున్న ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలిసిందే. నిజమైన హీరో అని సమాధానం ఇచ్చింది. సమంత గురించి అడగగా.. అద్భుతమైన నటి. సూపర్ ఉమెన్. అనేక విధాలుగా స్పూర్తి నింపుతుందని తెలిపింది. ఎన్టీఆర్ గురించి ఒక్కమాటలో చెప్పమని అడిగితే.. అద్భుతమైన ఎనర్జీ ఆయన సొంతం. ఆర్ఆర్ఆర్ లో ఆయన లుక్ కోసం ఎదురు చూస్తున్నామని సమాధానం ఇచ్చింది.
అభిమానులే నా బలం. భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్ సమయంలో భాగా ఎంజాయ్ చేసారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలో చెక్ దే ఇండియా అంటే ఇష్తం. ప్రభాస్ కూల్ పర్సన్. ప్రస్తుతం ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాని లావణ్య చెప్పుకొచ్చింది.