ట్రంప్’కి కరోనా ?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేనిపోని అనుమానాలు కలిగేలా మాట్లాడతారు. తాను మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా. ప్రతిరోజూ ఓ మాత్ర వేసుకుంటునానని ట్రంప్ ప్రకటించారు. దీంటో ట్రంప్ కి కరోనా పాజిటివ్ తేలిందా ? అనే ప్రచారం మొదలైంది. చివరికి దీనిపై వైట్ హౌస్ వర్గాలు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించాయి. తరచూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారని.. ఇప్పటివరకు అవన్నీ నెగిటివ్ గానే వచ్చినట్లు డాక్టర్ కోన్లీ తెలిపారు. ఇటీవల శ్వౌతసౌధంలో పలువురి సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు ట్రంప్ సహాయకుడు సైతం ఉండడంతో అక్కడి వైద్యులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో ఇప్పటి వరకు 15,37,830 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 90,694 మంది మృత్యువాతపడ్డారు. మరో 2,88,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు.