మంత్రికి కరోనా.. ఆస్తిని కూతురు పేరిట వీలునామా!
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లో కీలక మంత్రిగా కొనసాగుతున్న జితేంద్ర అహ్వద్ ఇటీవల కరోనా బారినపడ్డారు. మంత్రి అహ్వద్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన అహ్వద్ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారట.
కరోనా సోకిన క్రమంలో తాను ఎంతగానో మానసిక ఆవేదనకు గురైనట్లుగా చెప్పారు. తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే తనకు కరోనా సోకిందని వివరించారు. కరోనా నుంచి తాను కోలుకుంటానని, బ్రతుకుతాననే నమ్మకం కూడా లేకుండా వైరస్‌తో పోరాటం చేశానని చెప్పారు. అంతేకాదు.. తాను బ్రతికే ఛాన్స్ లేదని భావించి తన ఆస్తి మొత్తం తన కూతురికే చెందేలా..ఐసియూలోనే వీలునామా రాయించినట్లుగా చెప్పారు.