W.H.Oకు ట్రంప్ మరో హెచ్చరిక
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన విషయాన్ని, కరోనా కేసులకి సంబంధించి చైనా అబద్దాలు చెబుతోంది. ప్రపంచాన్ని మోసం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విషయంలో చైనాకి వంతపాడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ట్రంప్ కన్నెచేశారు. ఆ సంస్థకి ఇచ్చే నిధులని తాత్కాఌకంగా నిలిపివేశారు. తాజాగా మరోసారి ట్రంప్ డబ్ల్యూహెచ్ ఓ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ మేరకు డబ్ల్యూహెచ్ ఓ ట్రంప్ సోమవారం లేఖ రాశారు. డిసెంబరు 2019లోనే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. కావాలనే నిర్లక్ష్యం డబ్ల్యూహెచ్ ఓ చేసిందని ఆరోపించారు. ఆ సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించుకోవడంలో విఫలమైందని చెప్పుకొచ్చారు.
డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వ్యవహార శైలివల్లే నేడు ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని ట్రంప్ ఆరోపించారు. రానున్న 30 రోజుల్లో డబ్ల్యూహెచ్ ఓ తన విధానాలను మెరుగుపరచుకోకపోతే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వాతంగా ఆపేస్తానని హెచ్చరించారు. అలాగే, సంస్థలో అమెరికా సభ్యత్వంపై పునరాలోచించుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.