కోహ్లీని లంచం అడిగారట.. !

విరాట్ కోహ్లీ.. ఓ పరుగుల యంత్రం. రికార్డుల రారాజు. ఛేజింగ్ కింగ్. ఇప్పుడు ఆయనో శిఖరం. కానీ కోహ్లీ జీవితంలో కష్టాలు ఉన్నాయి. సగటు మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలని ఆయన అనుభవించారు. అప్పట్లో స్టేట్ క్రికెట్ లో సెలక్ట్ కావడానికి కోచ్ లంచం అడిగారట. అందుకు విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ నో చెప్పారట. ఆదివారం ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో లైవ్ చాట్ లో మాట్లాడిన కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

స్టేట్ క్రికెట్ లో ఎంపిక చేయడానికి కోచ్ లంచం అడగడంతో మా నాన్న ఒకే మాట చెప్పారు. ఒకవేళ విరాట్ మెరిట్ తో ఆడగలిగితే సరే, లేదంటే తనని ఆడించం. నేనైతే ఇలాంటి పనులు చేయను అని తేల్చిచెప్పారు. దాంతో నేను సెలెక్ట్ కాలేదు. అప్పుడు చాలా బాధపడ్డా. అయితే, ఆ ఘటనే నాకో పాఠం నేర్పిందని కోహ్లీ తెలిపారు.