ఆదా వెరైటీ నమస్కారం

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పొడుగుకాళ్ల సుందరి ఆదాశర్మ. ఆ తర్వాత పలు సినిమాలో నటించింది. మంచి నటి అనిపించుకుంది. అందాల ఆరబోతకి పెద్దగా అభ్యంతరాల్లేమ్ చెప్పలేదు. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆదా.. చిలిపి పనులు చేసిన వీడియోలు, కొత్త కొత్త ఫోటో షూట్స్ ఫోటోలని షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఆదా ఓ పోటోని షేర్ చేసింది. ఇందులో వెరైటీగా నమస్కారం పెట్టింది. ప్రస్తుతం అందరం లాక్‌డౌన్ లో ఉన్నాం. అది ఎత్తేసిన తర్వాత క్రియేటివ్ గా నమస్తేతో పలకరించాలి.. అంటూ తన వెరైటీ నమస్కారానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆదా. ఇక ఆదా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. అయితే అవకాశం ఇస్తే.. మాత్రం గ్లామర్ డోస్ పెంచి నటించడానికి ఆదా రెడీ !