తారక్’కు బిగ్ బాస్ గిఫ్ట్ అదిరింది

‘ఆర్ఆర్ఆర్’ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రాలేదు. కానీ ఆ లోటుని తీరుస్తూ కొన్ని బహుమతులొచ్చాయ్. ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ అందించిన వీడియో మెసేజ్ ఒకటి. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్స్ అంతా వీడియో రూపంలో తారక్ ని విష్ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తారక్, ఆయన ఫ్యామీలీ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు.. అవకాశం ఇస్తే.. ఓ సారి తారక్ ని కలవాలని ఉందనే కోరికని వెలుబుచ్చారు.

ఇక సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి తారక్ కి శుభాకాంక్షలు వెలువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, రామ్ చరణ్, టీడీపీ నేతలు నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు తారక్ ని విష్ చేశారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తారకరాముడి జపం చేశారు. ఆయన ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. తారక్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.