తారక్’కు మెగా విషెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తారక్ ని విష్ చేశారు. “హ్యాపీ బర్త్‌ డే భీమ్‌.. తారక్‌.. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా”నని మెగాస్టార్ ట్వీట్ చేశారు. 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తారక్ ని విష్ చేశారు. “మా ఎన్టీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని ఆశిస్తున్నా”నని ట్విట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ నందమూరి కల్యాణ్ రామ్ తారక్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక తారక్ బర్త్ డే గిఫ్ట్ గా ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ‘పక్కా లోకల్.. ‘ పాటకి టిక్ టాక్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ వీడియో ద్వారా తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో #HappyBirthdayNtr యాష్ ట్యాగ్ మంగళవారం నుంచే ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. తారక్ బర్త్ డే కానుకగా ఆయనతో సినిమా ప్రకటన చేశారు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.