కరోనా ఎఫెక్ట్ : మీడియా సమావేశాల్లేవ్.. పత్రికా ప్రకటనలు మాత్రమే !

కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం మీడియా సమావేశాలకి దూరంగా ఉంటుంది. గతంలో ఏదైనా విషయం చెప్పాలన్నా.. ఏదైనా ప్రకటన చేయాలన్న కేంద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసేది. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనాపై ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలన్నా, గణాంకాలను ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ప్రతిరోజూ కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా స్టేటస్ ని మీడియాకు వివరించేది. ఇప్పుడు అది మానేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో  మీడియా సమావేశాలను నిలిపివేసింది. మే 11న కేసులు 67,152కు చేరిన తరువాత మీడియా సమావేశాలు నిలిపివేసి, కేవలం పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య లక్షను అధిగమించిన సమయంలో..  ఆ   సమాచారాన్ని కూడా అందించలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు దూరం అవుతున్నారు.  

ఇకపై మీడియా సమావేశాలకు బదులుగా.. ప్రకటనలు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే కేంద్రం మీడియా సమావేశాలని నిర్వహించాలని.. కరోనా స్టేటస్ ని మీడియాకు వివరించాలనే డిమాండ్ పెరుగుతోంది.