బెంగాల్’లో అంఫాన్ బీభత్సం.. 12 మంది మృతి !
పెను తుఫాన్ గా మారిన అంఫాన్ తీరం దాటే సమయంలో బీభత్సం సృష్టించింది. బెంగాల్ తీరం వద్ద సుమారు గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో 12మంది మృతి చెందారు. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని బెంగాల్ ప్రభుత్వం అంచనా వేసింది. బెంగాల్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 5లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించింది. ఒడిశా ప్రభుత్వం కూడా లక్షమందికి పైగా షెల్టర్ హోమ్స్‌కు పంపించారు.